సాంకేతిక సదుపాయాలతో ఇంద్రకీలాద్రి..! 1 d ago
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు మొదలైయ్యాయి. దీనికోసం భక్తులకి మరింత సులువుగా సేవలు పొందేలా అధికారులు పనులు చేపట్టారు. దర్శనాలు బుకింగ్, ప్రసాదం కేంద్రాలు, రవాణా సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాలలో రద్దీ, ప్రాధమిక చికిత్స కేంద్రాలు, కేశఖండనశాల, ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు ఎక్కడ ఉన్నారు, ఎంత సేపటిలో ప్రదక్షిణం పూర్తి చేయగలరు వంటి వివరాలు అన్ని కూడా సెల్ ఫోన్ లో తెలుసుకునే వీలు కల్పించింది. గూగుల్ ప్లే స్టోర్లో 'భవాని దీక్ష - 2024' యాప్ ద్వారా సేవలు పొందవచ్చు అని అధికారులు చెప్పారు.